Listen to this article

జనం న్యూస్. మార్చి 8. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కుటుంబ సమస్యలతో వలస కార్మికుడు ఉరేసుకొని మృతి చెందిన సంఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది, హత్నూర ఎస్సై కె. సుభాష్ కథనం ప్రకారం మండల పరిధిలోని బోరపట్ల గ్రామ శివారులో గల ఎపిటోరియా యూనిట్ -1 పరిశ్రమలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం బర్ధమాన్ జిల్లా టక్ పూర్ గ్రామానికి చెందిన బనేశ్వర్ మూర్ము తండ్రి సోనాథన్ మూర్ము వయసు ( 22) అనే కార్మికుడు గత రెండు సంవత్సరాలు నుండి ఎపిటోరియా యూనిట్ -1 పరిశ్రమలో దినసరి కూలిగా పని చేస్తూ , పరిశ్రమ ఏర్పాటుచేసిన లేబర్ రూములలో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు, ఈ క్రమంలో రోజు మాదిరిగా విధులను ముగించుకొని రాత్రి అతని స్నేహితులు కలిసి భోజనం చేసి ఎవరి రూమ్ కు వారు వెళ్లి పడుకున్నారు, బనేశ్వర్ తన రూమ్ లో ఒక్కడే ఉంటున్నాడని పోలీసులు తెలిపారు , తన స్నేహితులు మొదటి షిఫ్ట్ డ్యూటీ వెళ్లడానికి బనేశ్వర్ తలుపులు తట్టగా టవల్ తో ఫ్యాన్ కి ఉరేసుకొని వెళ్లాడుతున్న బనేశ్వర్ ను చూసి అందరూ కలిసి కిందికి తీసి చూడగా అప్పటికే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు, అతను గత కొన్ని రోజుల నుండి తన కుటుంబ సభ్యులతో ఫోన్లో ఎక్కువగా మాట్లాడడం చిరాకుగా ఉండడం గమనించామని అతని స్నేహితులు తెలిపినట్లు ఎస్సై తెలిపారు, ఈ విషయంపై మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుభాష్ తెలిపారు.