

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. విద్యార్థులు ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్లాలని రిమ్స్ డాక్టర్ సృజన గైనకాలజిస్ట్ కామేశ్వరమ్మ పేర్కొన్నారు. నందలూరు మండలం గొబ్బిళ్ళ అక్షర స్కూల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వేడుకలు అత్యంత ఘనంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన లక్ష్మీ చైతన్య, షేక్ జైనబులను అభినందించారు మొట్టమొదటిసారిగా స్కూల్ నందు బాలికలు మరియు ఉపాధ్యాయులకు షీ రూమ్స్ ప్రారంభించడం జరిగినది ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు సంతోషిస్తూ స్కూలు యాజమాన్యం కు కృతజ్ఞతలు తెలియజేశారు విద్యార్థులకు తగు సూచనలు అందించారు ఈ కార్యక్రమంలో గొబ్బిళ్ళ అక్షర స్కూల్ యాజమాన్యం గొబ్బిళ్ళ త్రినాథ్ గొబ్బిళ్ళ శ్రీనాథ్ అలాగే ఉపాధ్యాయులు డాక్టర్ సృజన డాక్టర్ కామేశ్వరములను శాలువాతో సత్కరించారు