

జనం న్యూస్ మార్చి 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎస్సీ కాలనీలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఇళ్లు లేని అర్హులందరికీ ఇందిరమ్మ పథకంలో ఇళ్లు మంజూరు చేసి చేస్తామని చెప్పారు. ఇళ్లు మంజూరు అయిన లబ్దిదారులకు దశల వారీగా బిల్లులను అందించడం జరుగుతుందన్నారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారు అయిన దొడ్డి జమున – శంకర్ లకు ఎమ్మెల్యే శాలువా కప్పి అభినందించగా, ఎమ్మెల్యే జీఎస్సార్ కు ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుడు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ ఫణి చంద్ర మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…..