Listen to this article

జన న్యూస్ మార్చ్ 10 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం గౌతపూర్ గ్రామము లో నదరి స్వరూప విఠల్ తాజా మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ. నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం, ఆదివారం ఉదయం 10:30 గంటల నిర్వహించారు.హనుమాన్ దేవాలయం అంగరంగ వైభవంగా, రంగురంగుల లైట్లతోటి. పచ్చనిపందిర్ల తోటి సుందరంగా తీర్చిదిద్దారు.హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో నవగ్రహ విగ్రహాలను మరియు సుమారు 37 ఫిట్ల ధ్వజస్తంభ ప్రతిష్ట చేశారు. అనంతరం గ్రామ ఆడబిడ్డలు అందరూ నిడు బిందెతో దేవాలయం ముందు సాక పెంటడం మంగళహారతులతో ఎదుర్కోవడం జరిగింది. సకుటుంబ సమేతంగా దేవాలయ ప్రవేశం చేసి దర్శనం చేసుకోవడం జరిగింది ధ్వజస్తంభ దాత వెంకటపతి అంజిరెడ్డి గౌతాపూర్ గ్రామస్తులు నవగ్రహదాత
భాస్కర్ గౌడ్ చింతల చెరువు గ్రామ నివాసులు అన్నదాన వితరణ దాత వెంకటపతి గోవర్ధన్ రెడ్డి శంకరమ్మ లక్ష్మారెడ్డి జ్ఞాపకార్ధం నిర్వహించారు. హనుమాన్ దేవాల నిర్మాణానికి విరాళాలు ఇచ్చినటువంటి దాతలను దేవాలయం సభ్యులు శాలువాతో సత్కరించారు. సోమవారం రోజు ఉదయం 10 గంటలకు శ్రీశ్రీ శ్రీ మాధవనంద సరస్వతి చేతులమీదుగా. హనుమాన్ దేవాలయంలో 1, పుష్పార్చన కార్యక్రమం ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. మరియు పోచమ్మ దుర్గమ్మ దేవాలయకు సాయంత్రం బోనాల ఊరేగింపు ఉంటుందని తెలియజేశారు. స్వరూప విట్టల్ తాజా మాజీ సర్పంచ్ గౌతాపూర్. గ్రామ పెద్దల సహకారంతో హనుమాన్ దేవాలయ అభివృద్ధి తోడ్పడిన దాతలకు జన్మజన్మల రుణపడి ఉంటామని స్వరూప విట్టల్ తాజా మాజీ సర్పంచ్ తెలియజేశారు. సహకారం అందించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు