Listen to this article

జుక్కల్ మార్చ్ 10 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 200 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా. ఈరోజు మద్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృషి మరియు ప్రత్యేక శ్రద్ధ వల్లనే ఇంతటి ప్రతిష్టాత్మకమైన స్కూల్ మద్నూర్ కు రావడం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు..
అదేవిధంగా ఎమ్మెల్యేగా గెలిచిన అనతికాలంలోనే నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలలో మంచి ఆదరణ పొందుతున్నారని అన్నారు.మద్నూర్ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుకి రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు..