Listen to this article

జనం న్యూస్ మార్చి 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఐ ఎన్ టి యు సి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులుగా నియమించిన ఐ యన్ టి యు సి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బుద్ధారం మురహరి కి మరియు కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కి కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ కి నాకు సహకరించి ఈ పోస్ట్ రావడానికి కృషి చేసిన కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు ఐ యన్ టి యు సి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు ఫణింద్ర కుమార్ కోకిలిగడ్డ మాట్లాడుతూ ఇంత పెద్ద బాధ్యత నాకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడికి కలిసి ఆశీర్వదించమని కోరడమైనది నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని మరోసారి తెలియజేశారు. ఎంతో బాధ్యత గల పదవి కాబట్టి బాధ్యతతో పనిచేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కోరారు జిల్లా అధ్యక్షుని కలిసిన వారిలో కె.పి.హెచ్.బి డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మేకల మైకల్ కొమ్ము బాబురావు గిరి నాయుడు వెంకటేష్ గౌడ్ రాకేష్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.