

ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ పాలడుగు శ్రీనివాస్ జనం న్యూస్ మార్చ్ 11 సంగారెడ్డి జిల్లా హైదరాబాద్: మహిళల సమానత్వం అనేది మన ఇంటి నుండి ప్రారంభం కావాలని ఇంట్లో మగ పిల్లలను ఆడపిల్లలను సమానంగా చూడాలని ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ పాలడుగు శ్రీనివాస్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటుచేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఓ యు పరిశోధక విద్యార్థి నాయకులు పాలడుగు శ్రీనివాసును ఉన్నత విద్యా మండలి చైర్మన్ మరియు పలువురు ముఖ్య అతిధుల చేతుల మీదుగా ఆయనను ఘనంగా శాలువాతో సత్కరించి మెమొంటో ను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నన్ను సన్మానించిన ముఖ్య అతిథులకు , మహిళలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు , అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు. ప్రధానంగా మహిళల సమానత్వం అనేది మన ఇంటి నుండి ప్రారంభం కావాలని ఆయన అన్నారు. ఇంట్లో ఆడపిల్లలను మగ పిల్లలను సమానంగా చూడాలని సమానంగా చదివించాలని ఆయన కోరారు. నేటి సమాజంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యమని వారిని అన్ని రంగాల్లో పురోగమించేలా చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఆయన కోరారు. మహిళలు అన్ని రంగాల్లో పురోగమించడమే అసలైన అభివృద్ధి అన్నారు. సమాజంలో పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కలిగి ఉండాలని విద్యా ఉపాధి రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలన్నారు. ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో మహిళలు కీలక స్థలాల్లో అధిరోహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య అతిధులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.