

జనం న్యూస్ మార్చి 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని చలివాగు వద్ద రైతులకు సాగు నీరు లేక ఎండిపోతున్న పంట పొలాలను చూసి రైతన్న దిగ్భ్రాంతి చెంది రైతు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.ఈ సందర్బంగా రైతులు,బిఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో కలిసి శాయంపేట మండలంలోని,జోగంపల్లి గ్రామంలోని చలివాగు ప్రాజెక్ట్ పంపు వద్ద ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పాల్గొని అనంతరం పంపు హౌస్ సి ఈ అశోక్ కుమార్ కు ప్రాజెక్ట్ వద్ద నుండి ఫోన్ చేసి చలివాగు ప్రాజెక్ట్ లో కనీసం నీటిమట్టం ఉండేలా చర్యలు చేపట్టి చలివాగు ఆయకట్టు వెంట పండే పంట పొలాలకు సాగు నీరు విడుదల చేసిన తరువాతే పైకి ధర్మసాగర్ కి నీటిని పంపిణీ చేయాలని కోరారు.ఇక్కడి పంట పొలాలను ఎండబెట్టి పైకి నీటిని తీసుకెళ్ళాలని చూస్తే,చూస్తూ ఊరుకునేది లేదని పంపు మోటార్లు బంధు పెడతామని హెచ్చరించారు.ప్రస్తుతం పది అడుగుల నీటిమట్టం మాత్రమే ఉంది అన్నారు.నెల రోజుల పాటు చలివాగు ప్రాజెక్ట్ లోకి నీటిని విడుదల బంధు పెట్టడం వల్లే ఈ సమస్య ఏర్పడింది. రైతులకు సాగు, తాగు నీటిని విడుదల చేసిన తరువాత కనీసం 15 అడుగుల నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకొని తరువాత పైకి నీటిని పంపు చేయాలని అన్నారు.నీటి మట్టం పెరిగే వరకు మోటార్లు బంధు పెట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి,బి ఆర్ ఎస్ నాయకులు మారేపల్లి నందo, మాజీ ఉపసర్పంచ్ దైనంపల్లి సుమన్, దూదిపాల తిరుపతి రెడ్డి వల్పదాసు చంద్రమౌళి,గంట శ్యాంసుందర్ రెడ్డి, పెద్దిరెడ్డి ఆదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు….