

జనం న్యూస్ మార్చి 12 నడిగూడెం నడిగూడెం మండలంలోని కేశవపురం గ్రామంలో పోరుబాట కార్యక్రమం లో భాగంగా ఉపాధి హామీ కూలీల సర్వేను సీపీఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ పరిశీలించి మాట్లాడారు. పని ప్రదేశంలో మౌలిక వసతులు కల్పించాలని తీవ్రమైన ఎండలు ఉన్నందున మంచినీటి సౌకర్యం, టెంట్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు ఎస్కే మస్తాన్, శాఖ కార్యదర్శి పప్పుల విజయకుమార్, కూలీలు పాల్గొన్నారు.