

జనం న్యూస్ మార్చి 13(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష ఎండిన వరి పంటలకు ముప్పై వేల నష్టపరిహారం అందించాలని సిపిఐఎం జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదా అన్నారు.బుధవారం మునగాల మండల పరిధిలోని రేపాల లో సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం హించారు.ఈసందర్భగా ఆయన ఎండిన వరి పంటలను పరిశీలించి మాట్లాడారు. శ్రీరాంసాగర్ ద్వారా రైతాంగానికి సాగు నీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.ప్రభుత్వ విధానాలతో రైతు లు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.వేసంగిలో పంటలు సాగు చేసిన రైతులు నిలువునా మునిగారని కాల్వకు సరిపడా నీటిని విడుదల చేయకపోవడం విడ్డూరంగా వుందన్నారు.పంటలు ఎండిపోవడం తో రైతు లు అప్పుల పాలైయ్యారని తీరా పొట్ట దశలో పొలాలు ఎండి పోతున్నా పట్టించుకునే దిక్కేలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ పోరుబాట కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమపంగు జానయ్య, సిపిఎం మండల కమిటీ సభ్యులు తుమ్మ సతీష్,వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సభ్యులు పేర్ల వెంకన్న,పార్టీ శాఖా కార్యదర్శి ఎర్ర వెంకటేశ్వర్లు,గుండు వీరయ్య,గంట వెంకటేశ్వర్లు, పలువురు రైతులు పాల్గొన్నారు.