Listen to this article

సమస్యలు వలయం లో రింగారిట్ గ్రామం జనం న్యూస్ మార్చ్12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం రింగరేట్ గ్రామంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం (టీఏజీఎస్ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డి వై ఎఫ్ ఐ ), కుల వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీయస్ ) సంఘాల ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది, ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షురాలు కోరెంగ మాలశ్రీ మాట్లాడుతూ రింగరెట్ గ్రామం లో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు గ్రామానికి వెళ్లడానికి రహదారి లేదు వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడతారు, రెండు ఒర్రెలు ఉన్నాయి, వర్షాకాలం వచ్చిందంటే గ్రామం నుంచి బయటికి రావడానికి అవకాశం ఉండదు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే అంతే సంగతి, అదేవిధంగా గ్రామంలో సిసి రోడ్లు లేవు మిషన్ భగీరథ నెలలో ఉన్నప్పటికీ అవి పని చేయడం లేదు మిషన్ భగీరథ నుంచి త్రాగునీరు అందడం లేదు, గ్రామానికి దూరం గల ఒక బోర్వెల్ ద్వారా ప్రజలు త్రాగునీటిని తీసుకురావడం జరుగుతుంది, అదేవిధంగా ఆశ్రమ గిరిజన పాఠశాలలో ఉపాధ్యాయుడు రాక పిల్లలు రోడ్లపై తిరుగుతున్నారు, వారి జీవనం అధోగతి జిల్లా అధికారులు ఐటిడి అధికారులు వెంటనే స్పందించి ఆ గ్రామానికి వెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా చూడాలని ప్రజా సంఘాలు గా కోరుతున్నాము, లేనిపక్షంలో గ్రామ ప్రజలను కలుపుకొని ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాము, సందర్శించే వారిలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, టిఎజిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్, పాల్గొన్నారు,