

జనం న్యూస్ మార్చి 12 నడిగూడెం నడిగూడెం మండల స్వేరోస్ నూతన అధ్యక్షుడిగా నడిగూడెం గ్రామానికి చెందిన గంటేపంగు నాగార్జున ను ఎన్నిక చేసినట్లు స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగార్జున తెలిపారు. బుధవారం నడిగూడెంలో జరిగిన స్వేరోస్ కార్యకర్తల సమావేశంలో ఎన్నిక చేసి నియామక పత్రం అందించారు.ఈ నెల 15వ తేదీ నుండి ఏప్రిల్ 14 వరకు జరిగే భీమ్ దీక్ష విజయవంతానికి నూతన కమిటీ కృషి చేయాలని కోరారు.కార్యక్రమంలో స్వేరోస్ నాయకులు పందిటి క్రాంతికుమార్, ఉస్మానియా విద్యార్థి నాయకుడు గంటెపంగు నాగరాజు, దున్నా ప్రమోద్,పాత కోట్ల ఆకాష్, అశోక్ పాల్గొన్నారు.