Listen to this article

జనం న్యూస్ 13 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.రాజేష్‌ వర్మ ఎస్పీ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో శాంతి భద్రతలు, గంజాయి నియంత్రణలో జిల్లా పోలీసు యంత్రాగం చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఎస్పీని కలిసిన వారిలో లక్ష్మి నరసింహం, గోపాల్‌, రెడ్డి రమణ, వంశీ ఉన్నారు.