Listen to this article

మానవాళికి వ్యాధి నిర్ధారణ చేస్తున్న ప్రతీ ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ కి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ రాహిల్ మార్చి 13 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పాదమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డాక్టర్ రాహిల్ గారి సూచన మేరకు P H C లో విధులు నిర్వహిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ కుర్సం అశ్విని ని సాల్వతో సత్కరించి, కేకు కట్ చేసి వేడుక జరుపుకోవడం జరిగినది. ప్రస్తుతం మానవాళికి అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి ఏ వ్యాధికి చికిత్స చేయాలన్న అది ఏ జబ్బుకు సంబంధించిన వ్యాధి అని నిర్ధారణ కావాలన్నా టెక్నీషియన్ అవసరమని ఈ వ్యాధుల నిర్ధారణ జరిగే క్రమంలో తనను తాను రక్షించుకుంటూ తన ప్రాణాన్ని కాపాడుకుంటూ తన కుటుంబ సభ్యులకు కూడా తన వల్ల ఎటువంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మానవాళి కి వ్యాధి నిర్ధారణ చేస్తున్న ప్రతి ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ కు,ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్బంగా డాక్టర్ రాహిల్ శుభాకాంక్షలు తెలియజేసారు
ఈ కార్యక్రమంలో H E O వేణుగోపాలకృష్ణ, P H N సంగీత , ఫార్మసిస్ట్ సతీష్ , ఆరోగ్య కార్యకర్త తిరుపతి, సన్మాన గ్రహీత అశ్విని , స్టాఫ్ నర్స్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు