

ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల ఉపాధ్యక్షులు తాటి రాంబాబు మార్చి 13 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటాపురం మండల ఉపాధ్యక్షులు తాటి రాంబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఐదవ షెడ్యూల్ భూభాగంలో 1970 సంవత్సరం తర్వాత వలస వచ్చిన గిరిజనేతరులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. వెంకటాపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీల పేరుతో ఇందిరమ్మ ఇల్లు విషయంలో ప్రభుత్వ అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో ఆదివాసులకు అన్యాయం చేయాలని చూస్తే ప్రభుత్వంపై యుద్ధమే అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు అధిక శాతం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. లేనియెడల ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో దశలవారు ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సోడి గోపి, మీడియం వెంకటేశ్వర్లు,బొగ్గుల గోపి, బొగ్గుల రాంబాబు, తాటి సుమన్ తదితరులు పాల్గొన్నారు.