Listen to this article

శానార్తి తెలంగాణ. 13. నిజామాబాదు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత చేయకుండా ఉద్యోగాల ఫలితాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ డిచ్ పల్లి మండల ఇన్చార్జి నరసయ్య అధ్యక్షతన తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రిలే దీక్షలు ప్రారంభించారు. దీక్షకు ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు గందమల నాగభూషణం మాదిగ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందని అసెంబ్లీ సాక్షిగా సిఎం రేవంత్ రెడ్డి. మాదిగలకు ఇచ్చినటువంటి హామీని మరచి గ్రూప్స్ యొక్క ఫలితాలను ప్రకటించడం అందులో వర్గీకరణను అమలు చేయకపోవడం మాదిగ నిరుద్యోగులను నిరాశకు గురిచేసిందని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మాదిగల పట్ల నిర్లక్ష్య వైఖరి వీడి గ్రూప్1, గ్రూప్ 2,గ్రూప్ 3 యొక్క ఫలితాలను తక్షణమే విరమించుకుని ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీంకోర్టులో వర్గీకరణ అనుకూలంగా తీర్పు వచ్చిన తరుణంలో మాదిగ జాతి సంతోషాన్ని వ్యక్తం చేసిందని, ఆ క్రమంలోనే సిఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ మాదిగల న్యాయమైన పోరాటమని చెప్పి అన్ని ఉద్యోగాలలో ప్రత్యేక ఆర్డినె న్స్ తీసుకొచ్చి ఉద్యోగాల భర్తీ చేపడతామని చెప్పారు.గ్రూప్స్ యొక్క ఫలితాలను తక్షణమే నిలిపివేయాలని లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దశాబ్దాల కాలంగా మాదిగలు నిరీక్షణ ఫలించింది అని భావించిన ఈ తరుణంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండించారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టబద్ధత చేయకుండా ఉద్యోగాలు చేపడితే కాంగ్రెస్ ప్రభుత్వంపై మాదిగల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు డిచ్పల్లి ఎంఆర్పిఎస్ ఇంచార్జి డప్పు నరసయ్య మాదిగ.మోపాల్ మండల ఇన్చార్జి సంఘం కిష్టయ్య మాదిగ.ధర్పల్లి ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి నక్క రాజేందర్ మాదిగ. సిరికొండ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మొట్టల దీపక్ మాదిగ.ఎమ్మార్పీఎస్ ఇందల్వాయి మండల నాయకులు తెడ్డు మహేందర్ మాదిగ. డిచ్పల్లి ఎమ్మార్పీఎస్ మండల నాయకులు గరిక సాయికుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.