

జనంన్యూస్. 13. నిజామాబాదు. ప్రతినిధి. నిజాంబాద్ జిల్లా ప్రజలకు పోలీస్ కమిషనర్ సూచనలు చేశారు. జిల్లా ప్రజలు హోలీ పండుగను ఆనందంతో ప్రశాంతంగా జరుపుకోవాలని తెలిపారు. హోలీ పండుగ రోజున తమకు పరిచయం లేని వ్యక్తుల మీద రంగు పోయడం గాని ఇంకా వేరే ఎలాంటి సంఘటనలు చేయకూడదని సూచించారు సిటీలో పోలీసు యాక్ట్ అమలులో ఉన్నదని నిబంధనలు అధిక్రమిస్తే సెక్షన్ 22 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు అలాగే జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.
ద్విచక్ర వాహనంలో ఓవర్ లోడ్ తో వెళ్తూ స్టంట్ లు చేస్తూ రోడ్లపై స్పీడ్ గా వెళ్తే పోలీసులు చూస్తూ ఊరుకోరని కఠినంగా శిక్షించవలసి వస్తుందని తెలిపారు ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టకుండా ఆనందు స్థల మధ్య పండగ జరుపుకోవాలని. అలాగే ఎవరైనా బెట్టింగ్ ఆడితే అట్టి వారి విషయం పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ సాయి చైతన్య జిల్లా ప్రజలకు హోలీ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.