


గజ్వేల్ కేంద్రంగా తెలంగాణ వ్యాప్తంగా పాల్గొంటున్న భక్తులు ఈ జగమంతా రామమయమే అని చాటుతున్న భక్తులు జనం న్యూస్, మార్చి 14, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) గజ్వేల్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి తలంబ్రాల దీక్ష నిర్వహిస్తుంది శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ. అందులో భాగంగా రామకోటి పిలుపు మేరకు గురువారంనాడు మహబూబ్ నగర్ జిల్లా నవపేట మండలం పట్టణంలోని శ్రీ కన్యాకాపరమేశ్వరి దేవాలయంలో కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమం నిర్వహించారు శ్రీ వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షులు పూరి సురేష్ శెట్టి. భక్తులందరు రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఓలిచి రామభక్తిని చాటుకున్నారు. మొదటి సారిగా మా గ్రామానికి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు ద్వారా భద్రాచల రామయ్య తలంబ్రాలు రావడం మేము పాల్గొనడం మా అదృష్టం అని భక్తులు కొనియాడారు.