

జనంన్యూస్. 13. నిజామాబాదు. సిరికొండ.నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల ప్రభుత్వ తెలంగాణ ఆదర్శ పాఠశాలలో&కళాశాలలో పూర్వ విద్యార్థి అయినటువంటి అనుదీప్ ఇండియన్ నావిలో ఉద్యోగం సాధించినందుకు విద్యార్థిని మరియు వారి తల్లిని సత్కరించడం జరిగింది. అనుదీప్ మాట్లాడుతూ తన అమ్మగారు మరియు పీడీ నక్క కిషన్. ప్రోత్సహాంతో ఉద్యోగం సంపాదించాలని హర్షం వ్యక్తం చేశారు.
పాఠశాల ప్రిన్సిపాల్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి అనుకున్నటువంటి లక్ష్యం కోసం పోరాడే ప్రయత్నంలో ఎన్నో ఎదురుదెబ్బలు తలుగుతాయని వాటన్నిటింటిని అధిగమించి ముందుకు ప్రయాణించినట్లైతే తప్పకుండా ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని చేరుకోగలడని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం రాజేష్ రెడ్డి మిగతా ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.