

జనం న్యూస్ మార్చ్ 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలుగు మహిళ కవిత్రి ఆతుకూరి వల్ల మాంబ (మొల్ల) జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర, పాల్గొని ముందుగా ఆతుకూరి మొల్లమాంబ చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయ్ కృష్ణన్, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర మాట్లాడుతూ ఆతుకూరి మొల్ల 1440 మార్చ్ 13వ నెల్లూరు జిల్లా గోపవరం గ్రామంలో జన్మించారని వారి తండ్రి శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన మల్లెపువ్వు పేరు మీద తన కూతురికి మొల్ల పేరు పెట్టారని మొల్ల చిన్నతనం నుండి దైవభక్తి కలిగి తండ్రి గురువు సిఫార్స్ మేరకు రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారని రామాయణాన్ని తెలుగులో అనువదించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని, కుమ్మరి శాలివాహన కుటుంబాల్లో పుట్టిన మొల్ల బ్రహ్మచారిగా బీసీ కులస్తులకి ఎంతో సేవ చేశారని మొల్లమాంబ చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించి వారి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సత్యనారాయణ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజేశ్వరి, కుమ్మరి శాలివాహన సంఘం నాయకులు సైనిక్, సత్యనారాయణ, అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు.