Listen to this article

తిరుమలగిరి మార్చి 13 జనం న్యూస్ :తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో శాలివాహన అధ్యక్షులు పాల బిందెల యాదగిరి మాట్లాడుతూ సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అచ్చ తెలుగు నుడికారంతో రామాయణాన్ని రచించి ప్రజలకు అందజేసిన కవయిత్రి మొల్లమాంబ గొప్ప దార్శనికురాలని మండల శాలివాహన సంఘం అధ్యక్షులు పాలబిందల యాదగిరి వ్యాఖ్యానించారు. మండల కేంద్రంలో గురువారం మండల శాలివాహన సంఘం ఆధ్వర్యంలో మొల్లమాంబ 585 వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా శాలివాహనులు మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రామాయణాన్ని సరళంగా రచించి శ్రీకృష్ణదేవరాయల మన్ననలు పొందిన కవయిత్రి మొల్ల జీవితం అందరికీ ఆదర్శం అన్నారు. తెలుగు కవిత రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందడంతో పాటు నాటి సమాజంలో నెలకొన్న లింగ కుల వివక్షతను బద్దలు కొట్టి చరిత్రలో చిరస్థాయిగా మొల్లమాంబ నిలిచిందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు పాలబిందెల శేఖర్, కార్యదర్శి సోమయ్య, సహాయ కార్యదర్శి రాములు, కోశాధికారి కొండయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్, గౌరవ సలహాదారులు మల్లయ్య, సుభాష్, శేఖర్ (లెక్చరర్), శ్రీనివాసులు (ఉషశ్రీ),  సోమయ్య (లైబ్రేరియన్), వెంకటేశ్వర్లు (టీచర్),ఉపేందర్, ఎల్లయ్య, ఉప్పలయ్య, సిలివేరు ఊషయ్య, చిన్న రాములు, సళ్ళ రవి తదితర శాలివాహన సంఘ సభ్యులు పాల్గొన్నారు.