Listen to this article

(జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సాధారణ సమావేశం గురువారం ఏఎంసీ చైర్మన్ కవిత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ.. రైతుల సహకారంతో మార్కెట్ కమిటీ అభివృద్ధి పరచడమే పాలకవర్గ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బిచ్కుంద మార్కెట్ కమిటీ ఆదాయం గురించి చర్చించినట్టు తెలిసింది. ఈ సాధారణ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్, మార్కెట్ డైరెక్టర్ అజయ్ పటేల్ షణ్ముఖ పటేల్ , సాయిని అశోక్ ఇతర సభ్యులు సెక్రెటరీ రాజ్ కుమార్ ఏఎంసి కార్యాలయ సూపర్వైజర్లు సిబ్బంది పాల్గొన్నారు.