

జనం న్యూస్ మార్చి 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి అసెంబ్లీ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్ నందు హోళీ సంబరాలను భారతీయ జనతా పార్టీ కూకట్పల్లి అసెంబ్లీ ఇంచార్జ్ మాధవరం కాంతారావు ఆ పార్టీ శ్రేణులతో కలిసి జరుపుకున్నారు ఇక ప్రతినిత్యం పార్టీ మరియు సేవా కార్యక్రమాలతో బిజీగా ఉండే తమ నాయకుడు కాంతారావు కార్యకర్తలతో మమేకమై హోలీ సంబురాల్లో పాల్గొనడం క్యాడర్ లో మరింత జోష్ పెంచింది ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ ఐక్యతకు ప్రతీకగా నిలిచే రంగుల పండుగను ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా జరుపుకోవాలని మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకుంటూ భావితరాలకు అందించే బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు సంప్రదాయ పద్ధతుల్లో సహజ రంగులను ఉపయోగించి హోలీ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ కూకట్పల్లి ప్రజలందరికీ మాధవరం కాంతారావు హోళీ పండుగ శుభాకాంక్షలను తెలిపారు. ఈ వేడుకల్లో భాజపా శ్రేణులు వినోద్ కుమార్ గౌడ్ గోపి సత్యనారాయణ వెంకటరమణ భగవంత్ రెడ్డి గణేష్ శేఖర్ సాయి వెంకట్ ప్రేమ్ చంద్రశేఖర్ గిరివర్థన్ రెడ్డి శిరీష రెడ్డి తదితరులు పాల్గొన్నారు