Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 14 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మాదక ద్రవ్యాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసులు చేపట్టిన “సంకల్పం” కార్యక్రమంకు ప్రతిష్టాత్మకమైన స్కాచ్ అవార్డు లభించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మార్చి 13న తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసుశాఖ చేపట్టిన చర్యలను ‘సంకల్పం’ కార్యక్రమం ఇస్తున్న ఫలితాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ‘స్కాచ్’ అవార్డుకు ఎంపిక చేసిందన్నారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పోలీసులు డ్రగ్స్ నియంత్రణకు చేపడుతున్న చర్యలను పరిశీలించారన్నారు. చివరకు విజయనగరం జిల్లా పోలీసుశాఖ చేపట్టిన ‘సంకల్పం’ కార్యక్రమాలతో సంతృప్తి చెంది, ప్రతిష్టాత్మకమైన స్కార్ అవార్డుకు ఎంపిక చేసారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా జిల్లా పోలీసుశాఖ ఒకవైపు కఠినమైన చర్యలు చేపడుతూ, మరోవైపు విద్యార్థులు, యువత, ప్రజలను మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పప్రభావాలను వివరించేంందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన యువతలో మార్పు తీసుకొని వచ్చి, వారిని తిరిగి సన్మార్గంలో నడపాలనే ఉద్ధేశ్యంతో, మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పప్రభావాలను యువతకు వివరించి, అవగాహన కల్పించి, చైతన్యం తీసుకొని వచ్చి, వారిని మాదక ద్రవ్యాల అలవాటుకు దూరం చేసి, తిరిగి సన్మార్గంలో నడిపించేందుకు ప్రత్యేకంగా “సంకల్పం” కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మాదక ద్రవ్యాల అలవాటుతో విద్యార్థుల భవిష్యత్తు ఏవిధంగా నాశనం అవుతున్నది విద్యార్థులకు వివరించి, మత్తు, మాదక ద్రవ్యాలకు దూరం చేయడం, మాదక ద్రవ్యాల అలవాటు ప్రారంభంలో ఉన్న విద్యార్ధులను గుర్తించి, వారికి కౌన్సిలింగు నిర్వహించి, డీ అడిక్షన్ సెంటర్లకు పంపి, చికిత్స అందించి, తిరిగి వారిని సన్మార్గంలో నడిపేందుకు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ‘సంకల్పం’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని విద్యా సంస్థలను పోలీసు అధికారులు, సిబ్బంది సందర్శించి, మత్తు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరుతూ, మాదక ద్రవ్యాలను సేవించడం వలన వారి భవిష్యత్తు ఏవిధంగా నాశనమవుతున్నదో తెలిపే లఘు చిత్రాలను ప్రదర్శించి, పవర్ పాయింట్ ప్రెజెంటేషనుతో వారికి అర్ధమయ్యే రీతిలో వివరిస్తున్నామన్నారు. కళాశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసి, మాదక ద్రవ్యాల అలవాటు ఉన్న విద్యార్థులను గుర్తించి, వారిలో చైతన్యం నింపేందుకు కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. మాదక ద్రవ్యాల ప్రభావం వలన కుటుంబం, మానవ సంబంధాలు, ఆరోగ్యం, విద్య, ఆర్థికంగా ఏవిధంగా విచ్ఛిన్నమవుతున్నారు, న్యాయపరమైన చిక్కులు ఏర్పడి, చివరికి క్రిమినల్ కేసుల్లో నిందితులుగా మారుతున్నది వివరిస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. అంతేకాకుండా, ఈ చెడు అలవాట్లు నుండి బయట పడేందుకు అవలంభించాల్సిన మార్గాలను విద్యార్థులుకు సూచిస్తున్నామన్నారు. వీటిలో భాగంగా యోగా, ఎక్సర్సైజ్, క్రీడలు, జాగింగు, మ్యూజిక్, నడక, పుస్తకాలు చదవడం, మంచి ఆహారం తీసుకోవడం చేయాలని సూచిస్తున్నామన్నారు. కళాశాలల్లో మాదక ద్రవ్యాల అలవాటు ఉన్న విద్యార్థుల సమాచారం, వారికి డ్రగ్స్ ఎక్కడ నుండి సరఫరా అవుతున్నదన్న విషయాలు తెలుసు కొనేందుకు డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాల పట్ల ప్రజలను కూడా చైతన్యవంతులను చేసేందుకుగాను ‘సంకల్ప రధం’ను రూపొందించి, స్కూల్స్, జిల్లాలోని వివిధ పోలీసు స్టేషను పరిధిలోని ముఖ్య కూడళ్ళను సందర్శించి, మాదక ద్రవ్యాల వలన కలిగే చెడు ప్రభావాల పట్ల అవగాహన కల్పిస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. జిల్లాలో గంజాయి నియంత్రణకు చేపడుతున్న చర్యలో భాగంగా 2024 సం.లో గంజాయి అక్రమ రవాణకు
ప్పాలడుతున్న వారిపై 62 కేసులు నమోదు చేసి, 1656.990 కిలోల గంజాయి, 70 గ్రాముల నల్లమందు స్వాధీనం చేసుకొని, 218మందిని అరెస్టు చేసామన్నారు. 2025 సం. లో ఇప్పటి వరకు 24 కేసులు నమోదు చేసి, 265.626 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, 65మందిని అరెస్టు చేసామన్నారు. గ జాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లుగా 54 గ్యాంగులను గుర్తించామని, వీటిలో 34మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారన్నారు. ‘సంకల్పం’ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా 2011 నిర్వహించి, 1,18,000 మంది ప్రజలకు అవగాహన కల్పించి, 45,150 కర పత్రాలను పంచి పెట్టామన్నారు. కళాశాలలు, పబ్లిక్ ప్లేస్లలో 119 డ్రాప్ బాక్సులను. 98 హెర్డింగులను ఏర్పాటు చేసామన్నారు. జిల్లా వ్యాప్తంగా 632 కళాశాలలు/స్కూల్స్ ను సందర్శించి, సంకల్పం కార్యక్రమాలను నిర్వహించి, పెద్ద ఎత్తున విద్యార్థులను చైతన్య పర్చామన్నారు. జిల్లా వ్యాప్తంగా సంకల్ప రధంతో 87 స్కూల్స్ను సందర్శించి, 18,042 విద్యార్థులకు అవగాహన కల్పించామని, 103 గ్రామాలను సందర్శించి, ప్రదర్శనలు నిర్వహించి, 8,975మందికి మాదక ద్రవ్యాలపట్ల అవగాహన
కల్పించామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.