Listen to this article

జనం న్యూస్ మార్చ్ 14 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయములో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. హోలీ పండుగను పురస్కరించుకొని ఆసిఫాబాద్ ఎస్పీ కార్యాలయమునకు చేరుకున్న పోలీస్‌ అధికారులు, సిబ్బంది కలిసి ముందుగా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్ కి రంగులు పుయటం జరిగింది. ఈ సందర్బంగా ఎస్పీ అధికారులు, సిబ్బందికి రంగులు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ వేళ అధికారులు సిబ్బంది పరస్పరం రంగులు పూసుకోవడంతో పాటు బ్యాండ్‌ వాయిద్యాలతో ఎస్పీ , అధికారులు, సిబ్బంది, అందరు ఆనందం తో నృత్యాలు చేశారు.
ఈ హోలీ వేడుకలను పురస్కరించుకొని ఎస్పీ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషాలు, వెల్లువిరియాలని, ఈ హోలీ పండుగ మీ జీవితాలను రంగులమయం చేయాలని తెలిపారు. ఈ వేడుకల్లో జిల్లా అదనపు ఎస్పీ ఆర్ ప్రభాకర రావు,ఆసిఫాబాద్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ , కాగజ్నగర్ డిఎస్పి రామనుజం , డిసిఆర్బి డిఎస్పి కరుణాకర్ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, ఆర్‌.ఐలు పెద్దన్న, అంజన్న, సిఐలు రవీందర్, సత్యనారాయణ ,బుద్దే స్వామి , సిసి కిరణ్, ఆర్ఎస్ఐ లు , మహిళా పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఇతర పోలీస్‌ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.