

జనం న్యూస్ // జనవరి 13// జమ్మికుంట // కుమార్ యాదవ్..
హుజురాబాద్ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ.. భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ వేళ ప్రతి ఇంట్ల సుఖసంతోషాలు ఆరోగ్యం కోరుకున్నవన్నీ జరగాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. అదేవిధంగా రైతు అన్నలకు మంచి లాభాలు జరగాలని, యువకులకు మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు రావాలని మాట్లాడారు. ప్రతి విషయంలో మా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల మీకు సహకారం ఉంటుందని మీకు తోడుగా ఉంటుందని తెలిపారు.