Listen to this article

దేవాలయ చైర్మన్ సారిక చిన్న రామయ్య యాదవ్

జనం న్యూస్ మార్చి 15(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) భక్తిశ్రద్ధలతో కొలిసిన వారికి కొంగుబంగారం వలే వరాలు ప్రసాదించే శ్రీ రేపాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.స్వామి వారి కళ్యాణానికి ముందు ఆలయ ఆవరణలో వందలాదిమంది భక్తుల సమక్షంలో లక్ష్మీనరసింహస్వామి చెంచులక్ష్మి రాజ్యలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలను పల్లకిలో ఏర్పాటు చేసి డోలు సన్నాయి వాయిదాలు, కాగడాల దీపోత్సవాలతో ఆలయ అర్చకులు వేదమంత్రోత్సవాలతో అంగరంగ వైభవంగా కనుల పండువగా ఎదుర్కోల కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో స్వామివారి అమ్మవార్లకు సాంప్రదాయకంగా కళ్యాణాన్ని జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ డిసిపి నంద్యాల కోటిరెడ్డి హాజరయ్యారని దేవాలయ చైర్మన్ సారిక చిన్న రామయ్య యాదవ్ తెలిపారు.ఈ సందర్భంగా ఎంతో భక్తిశ్రద్ధలతో భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని చైర్మన్ తెలియజేశారు.