

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. మార్చి 14, నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోగల గొల్లపల్లి గ్రామం నందు నూతనంగా నిర్మించిన రామాలయం నందు శుక్రవారం గొల్లపల్లి గ్రామస్తులు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం వేద పండితులు బండి ఆత్మకూరు శివకుమార్ శర్మ అధ్యక్షతన ఆవాహిత పూజలు, యంత్రాభిషేకాలు,సూక్త వాహనములు,అరుణ హోమం నిర్వహించారు అనంతరం గొల్లపల్లెలోని ఆంజనేయస్వామి ఆలయం నుండి నూతన రామాలయం వరకు రాముడు,లక్ష్మణుడు, సీత,వినాయకుడు, శ్రీకృష్ణుడు విగ్రహాలను డప్పు వాయిద్యాలు బాణాసంచా పేలుస్తూ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, అనంతరం ఆలయ కమిటీ వారు భక్తులకుఅన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు