

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.మార్చి 14, నందలూరు మండలంలోని రైల్వే కేంద్రంలో రైల్వే కార్మికులు శుక్రవారం ఉదయం ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించుకున్నారు, ఒకరికొకరు రంగులు పూసుకుంటూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా హోలీ పండుగ సంబరాలు చేసుకున్నారు, ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి చెందిన ఉత్తరప్రదేశ్,బీహార్, రాజస్థాన్ రైల్వే కార్మికులు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు, మహిళలు ఉదయాన్నే లేచి వివిధ రకాల పిండి వంటలు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి పిల్లలు పెద్దలు రంగు చల్లుకొని హోలీ పండుగ నిర్వహించుకున్నారు