Listen to this article

జనం న్యూస్ మార్చి 14 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలో హోలీ పండుగ సందర్భంగా మెదక్ నిజాంబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన చిన్న మైల్ అంజి రెడ్డి కాలనీ వాసులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి పట్ట బద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తన నివాసంలో హోలీ సంబరాల్లో పాల్గొని అనంతరం మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.సప్త వర్ణాలు చిరుజల్లులుగా మారి దేహాన్ని తడిపే రంగుల వేడుక హోలీఆత్మీయులతో ప్రేమానుబంధాలు వసంతంలా వికసించాలా చేసే సంబరం హోలీ
రాధాకృష్ణుల ప్రేమ గీతాల గాన విభావరి మధుర హోలీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అందమైన హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మరియు రామచంద్రపురం కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.