

జనం న్యూస్ 13 జనవరి
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
నేడు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దరాష్ట్ర చిన్న, సూక్ష్మ మరియు మధ్యతరగతి పరిశ్రమలు మంత్రి.కొండపల్లి శ్రీనివాసరావు జెండా ఊపి బస్సులు ప్రారంభించారు.విజయనగరం, ఎస్.కోట మరియు పార్వతీపురం డిపోలకు చెందిన 04 నూతన ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించినారు. తదుపరి విజయనగరం డిపో గేరేజీ ఆవరణలో మొక్కను నాటినారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిధిగా విజయనగరం జోనల్ చైర్మన్ దొన్న దొర
మరియు ఈడి.విజయకుమార్ , డి పి టి ఓ అప్పలనారాయణ డిపో మేనేజర్ కే.శ్రీనివాసరావు విజయనగరం,ఎస్.కోట డిపో మేనేజర్లు, సూపర్ వైజర్లు, కార్మికులు మరియు కార్మిక నాయకులు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.