

జనం న్యూస్,మార్చి15, అచ్యుతాపురం:స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ విజయ కృష్ణన్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఎం జగన్నాథ పురం గ్రామ పంచాయతీలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర అవగాహన ర్యాలీని ప్రారంభించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలుకుదాం – స్వచ్ఛ ఎలమంచిలి నియోజవర్గంగా తీర్చిదిద్దుదాం అంటూ నినాదాలు చేస్తూ ప్రతిజ్ఞ చేశారు. కలెక్టర్ మరియు ఎమ్మెల్యే విజయ్ కుమార్ తదితర అధికారులు చీపురు పట్టుకొని డ్రైనేజీను ఊడ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి నెలా 3వ శనివారం కచ్చితంగా ఈ కార్యక్రమం రగాలన్నారు.జిల్లాలోనే యలమంచిలి నియోజకవర్గంను పరిశుభ్రతలో అగ్రగామిగా నిలపాలన్నారు. ఇంటింటా నూరు శాతం చెత్త సేకరణ జరగాలన్నారు. దానిలో తడి చెత్త, పొడి చెత్త వేరే చేయాల్సిన అవసరం ఉందన్నారు. చెత్త కుప్పలు లేని సమాజం తయారు చేయడమే మన లక్ష్యమన్నారు. అంగన్వాడీ కేంద్రం, జడ్పి హైస్కూలును సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను ఎమ్మెల్యే విజయ్ కుమార్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్,ఆర్డిఓ మరియు అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.