

జనం న్యూస్ 15 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా కళ్ళు మూసుకొని రిజిస్ట్రేషన్లు చేస్తున్న సబ్ రిజిస్టర్ సబ్ రిజిస్టర్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు అంటున్న పంచాయతి కార్యదర్శలు జిల్లాల్లో తెలుగోనిపల్లి , లత్తిపురం గ్రామాలలో ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చాలా గ్రామాల్లో ఓనర్ షిప్ సర్టిఫికెట్ కోసం పంచాయతీ కార్యదర్శిల సంతకాలను పోర్జారీ చేస్తూ నకిలీ స్టాంపులు తయారుచేసి డాక్యుమెంట్ సృష్టించుకుని రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్ సృష్టించి అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న సంఘటన గద్వాల మండలం తెలుగోనిపల్లి, లత్తిపురం గ్రామాల్లో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వ్యక్తి 30 ఏళ్ల కిందట గ్రామంలో ప్రభుత్వ స్థలంలో కబ్జాలో ఉన్నాడు ఆయన సంతానంలో ఒకరు తన మాట కింద వచ్చిన స్థలంలో రేకుల షెడ్ చేసి ఇంటి నెంబర్ వచ్చే విధంగా చేసుకున్నాడు. అనంతరం భార్య పేరు మీద ఓనర్ షిప్ సర్టిఫికెట్ సంపాదించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. చిన్నాన్న పెద్దనాన్నల భాగానికి వచ్చిన స్థలాన్ని కూడా వారికి తెలియకుండా పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ స్టాంపులతో ఓనర్ షిప్ సర్టిఫికెట్ సృష్టించి గద్వాల రిజిస్టర్ కార్యాలయంలో గత సంవత్సరం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరో గ్రామం, తెలుగోనిపల్లి లో కూడా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కార్యదర్శి సంతకాన్నీ పోర్జరి చేసి ఓనర్ షిప్ సర్టిఫికెట్ తయారు చేసుకున్నాడు ఈ విషయం అక్కడ పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శి తెలియడంతో గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషుల సమక్షంలో బయటకు పోక్కకుండ జాగ్రత్త పడ్డారు ఈ విషయంపై గతంలో ఇక్కడ పనిచేసినటువంటి పంచాయతీ కార్యదర్శి నిరంజన్ రెడ్డి వివరణ కోరగా తన సంతకాని ఫోర్జరీ చేసిన మాట వాస్తవమేనని దీనిపై పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు.