Listen to this article

జనంన్యూస్. 15. నిజామాబాదు.ప్రతినిధి. నిజామాబాదు జిల్లా నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సాయి చైతన్యను . నిజామాబాదు అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. నిజామాబాదు జిల్లాలో లా &ఆర్డర్ అదుపు చేయడంలో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా జరుగుతున్నా డ్రగ్స్, గంజాయి, మారకద్రవ్యల పైన ఉక్కు పాదం మోపి యువతను వాటి బారిన పడకుండా రక్షించాలని అన్నారు, మారకద్రవ్యల పైన పోలీస్ శాఖ వారు కళాశాల విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నగరంలో వరుస దొంగతనాలు చైన్ స్నాచింగ్, ఆటో, బైక్ దొంగతనాలు అరికట్టి ప్రజలకు రక్షణగా నిలవాలన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య, ఫుట్ పాత్ కబ్జాలు, అక్రమ భూ కబ్జాలపై ప్రతేక ద్రుష్టి పెట్టాలని కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోని సామాన్య ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. జిల్లా అభివృద్ధి, లా & ఆర్డర్ కాపాడటంలో పోలీస్ శాఖ వారు తీసుకునే ప్రతి అంశంలో ఎమ్మెల్యేగా తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేసారు.