Listen to this article

దుప్పట్లు,స్కూల్ బ్యాగులు పంపిణీ

అచ్యుతాపురం(జనం న్యూస్):శ్రీ స్వామి వివేకానంద 162 వ జయంతి వేడుకలు
శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద ఆర్గనైజేషన్ అధ్యక్షులు,కార్యదర్శిలు చోడిపల్లి అప్పారావు, మేరుగు అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.జయంతి కార్యక్రమంలో భాగంగావయోవృద్ధులు,వితంతువులు,దివ్యాంగులకు దుప్పట్ల పంపిణీ మరియు చిన్నారులకు స్కూల్ బ్యాగులను ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన వైస్ ఎంపీపీ వాసుపల్లి శ్రీనివాస్ రావు,మత్స్యకార నాయకులు ఉమ్మిడి అప్పారావు,జగన్,మేరుగు నూకరాజు,దాసరి శ్రీను చేతులు మీదగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వివేకానందన వివేకానంద యూత్ సభ్యులు,మేరుగు అప్పలరాజు,ఏరిపిల్లి కోదండరావు,దాసరి శ్రీను,రెవిడి ఆనందరావు,మైలపల్లి దిలీప్,ఏరిపిల్లి బాపునాయుడు,ఈరిగిల భాగ్యరాజు, సూరాడ మహేష్,కరుకు నాగరాజు, మేరుగు రాజారావు, ఏరిపిల్లి మహేష్,ఏరిపిల్లి అప్పారావు మరియు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.