Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 15 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 లో భాగంగా ప్రతినెల మూడవ శనివారం స్వచ్ఛత వారంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చిలకలూరిపేట పట్టణంలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల యందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు ఏడో వార్డు శానిటేషన్ సెక్రటరీ సిహెచ్ విజయ్ కుమార్ చిలకలూరిపేట పురపాలం సంఘం వారు విడుదల చేసిన కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించడం జరిగింది. ప్లాస్టిక్ ని నిషేధించాలని కాలువల్లో చెత్త వేయరాదని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని విద్యార్థులకు తెలిపారు ప్రతి పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించాలని ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు పాఠశాల ఆవాస ప్రాంత, పరిసరాలను. తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మొక్కలునాటడం వాటి పెంపకంపై శ్రద్ధ వహించాలని మొక్కలను నాటడం వాటిని సంరక్షించాలని తెలియజేయడం జరిగింది. పాఠశాలను పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు సూచించడం జరిగింది,ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రతే ఆరోగ్య భద్రతగా గుర్తించాలని, వ్యాధులువచ్చాక చికిత్స తీసుకునే కంటే వ్యాధులు రాకుండా నివారించడం ముఖ్యమని తెలియజేశారు. పాఠశాల స్వచ్ఛ కమిటీని ఐదుమంది విద్యార్థులతో ఏర్పాటు చేయడం జరిగింది. చేతులు పరిశుభ్రం చేసుకోవటం లోని వివిధ పద్ధతులు తెలియజేయడం జరిగింది. విద్యార్థులచే చిత్రలేఖన పోటీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే సుధా ఉపాధ్యాయులు పోటు శ్రీనివాసరావు,యన్ అంజమ్మ.విద్యార్థిని విద్యార్థులు. పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.