Listen to this article

బెజ్జుర్ :మార్చి 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలకేంద్రంలోని మారుమూల, దట్టమైన అటవీ ప్రాంతంలో మానక దేవర వద్ద బోర్ చెడిపోయి దాదాపు నెలలు గడిచిన బోర్ చెడిపోయిందని తెలిసి కూడా చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారు. కనీసం ప్రజలకు దాహం తీర్చే నాయకులు కరువైయ్యారు. గత నెలల నుండి బోర్ రిపేర్ చేయండి అని ప్రజలు గగ్గోలు పెట్టిన పట్టించుకొనే నాధుడు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు దాహం తీర్చని స్థితిలో ఉన్నారు. రిపీర్ చేసినట్లయితే బెజ్జుర్ పెంచికల్ పేట్ మండలవాసులకుబుక్కెడి నీళ్లు దాహం తీర్చిన వరౌతారని, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ దారి గుండా ప్రతిరోజు వాహనాలు, బాటసారులు, నిత్యఅవసరవస్తువులకు మండలం కేంద్రాలకు రవాణా సాగిస్తుంటారు. ఇంత బాధలు అవస్థలు ఉన్న నాయకులు పట్టించుకోవడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. కొంత మంది ఆదివాసీ నాయకులు అధికారుల దృష్టికి తీసుకోవెల్లిన పట్టించుకున్న దాఖాలు లెవనీ అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బుక్కెడి నీళ్లు కోసం రహదారి వెంట ప్రయాణికులకు దాహం తీర్చాలని ప్రజలు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మానక దేవరవద్ద చెడిపోయిన చేతి పంపు బాగు చేసి బుక్కెడి నీళ్లు అందించాలని దాహం తీర్చాగలరని కోరుచున్నాము..