Listen to this article

జనం న్యూస్// మార్చ్//15//జమ్మికుంట//కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలంలోని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ఆదేశానుసారం గత నెలలో ఆర్ బి యస్. కె టీం ద్వారా అన్ని పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగినది. ఈ కంటి పరీక్షలలో జమ్మికుంట మండలంలో 55 మంది కంటి దృష్టిలోపం ఉన్న విద్యార్థి ని విద్యార్థులను గుర్తించడం జరిగినది. అట్టి కంటి దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు రో కరీంనగర్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి, ఆదేశానుసారం శనివారం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో, జమ్మికుంట పట్టణం లోని మైనారిటీ బాలికల పాఠశాలలో మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమమునకు మండల విద్యా శాఖాదికారి హేమలత ముఖ్య అథి తీగా హాజరై, వారి చేతుల మీదుగా కంటి అద్దాలను విద్యార్థులకు పంపిణీ చేసారు. అదేవిధంగా డాక్టర్ రాజేష్, డాక్టర్ మొగిలి కండ్ల సంరక్షణ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. డాక్టర్ చందన మరియు హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి పోషకహారం, వ్యక్తి గత పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు, రక్త హీనత మొదలగు వాటి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. మంచి పోషకహారం, పండ్లు, పాలు, గుడ్లు, చేపలు, ఆకు కూరలు తీసుకున్నట్లు ఐతే ఆరోగ్యం ఉంటారని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా వడ దెబ్బ లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరించి చెప్పారు.ఈ కార్యక్రమములో మండల విద్యా శాఖాది కారి హేమలత ,డాక్టర్ రాజేష్, డాక్టర్ చందన, డాక్టర్ మొగిలి , హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, హెల్త్ సూపర్ వైజర్ అరుణ, సదానందం, నదియా ఫార్నాజ్ స్కూల్ హెడ్ మాస్టర్స్, ఆర్ బి యస్ కె వైద్య సిబ్బంది, స్కూల్ టీచర్స్, ఆశా కార్యకర్తలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.