Listen to this article

జనం న్యూస్ మార్చ్(15) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలోని సూర్యాపేట- దంతాలపల్లి రోడ్డు మీద బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎస్ఏ రజాక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాజీమంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంట కండ్ల జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుండి అక్రమంగా సస్పెండ్ చేసినందుకు నిరసన తెలిపినారు. ఈ సందర్భంగా రజాక్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు పరచకపోవడంతో జగదీష్ రెడ్డి అసెంబ్లీలో నిలదీయడంతో అక్రమంగా అసెంబ్లీనుంచి సస్పెండ్ చేయడం కాంగ్రెస్ పార్టీ పిరికిపంద చర్యని తెలిపినాడు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ రెడ్డి, నరసింహారావు, వెంకన్న, ఉమామహేశ్వర్, అమృత రెడ్డి, సంజీవరెడ్డి,వెంకన్న,తిరుమలరావు, రాజు,అవిలయ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.