

జనం న్యూస్ -మార్చి 16- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని సెయింట్ జోసఫ్ చర్చి 54 వ వార్షికోత్సవాన్ని శనివారం పారిష్ ప్రీస్ట్ ఫాదర్ సాగిలిజయరాజుఆధ్వర్యంలో చర్చి సంఘస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మొదట మూడు రోజులపాటు చర్చి లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా అతిధి ఫాథర్లు చేసినప్రధానప్రసంగాలను, మాస్ ను భక్తులు భక్తిశ్రద్ధలతో ఆలకించారు. నల్గొండ జిల్లాకు చెందిన బిషప్ కరణం ధమన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి నెల సెయింట్ జోసెఫ్‌కు అంకితంచేయబడిందని,అతని యొక్క అత్యంత పవిత్రమైన, స్వచ్ఛమైన హృదయానికి ఒక నిర్దిష్టమైన ఆరాధన ఈరోజున అందించబడుతుందని తెలుపుతూ ఏసుక్రీస్తు తండ్రి జోసఫ్ ఔన్నత్యాన్ని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెరాల్డ్స్ అఫ్ ఆఫ్ గుడ్ న్యూస్ ప్రొవెన్షియల్ ఫాదర్
పచ్చిగొల్ల క్రీస్తు రాజు,ఫాదర్ మధు సిస్టర్లు లలిత, ,క్లారా, ప్రియా, చర్చి పెద్దలు అంతయ్య, డి యస్ రాజు, ఫ్రాన్సిస్, అనంత్, అంతోని, క్యాథలిక్ సంఘ సభ్యులు, స్త్రీలు పాల్గొన్నారు.