

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోగల అరవపల్లిలో ఆర్ అండ్ బంగ్లా కూడలి దగ్గర మూడవ శనివారం లో భాగంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పంచాయితీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాయక్, నందలూరు తాసిల్దార్ వి పుల్లారెడ్డి, ఎంపీడీవో రాధాకృష్ణ, పంచాయతీ కార్యదర్శి సురేష్ బాబు, మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత మండలంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు, కార్యాలయాలలో పరిశుభ్రత పాటించాలని కాలుష్య కారణాలైన ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని అంతేకాక ప్రతి ఒక్కరూ తమ నివాసాల దగ్గర పరిశుభ్రంగా ఉండేట్లు చూడాలని వారు కోరారు, ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి పల్లె పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ, మైనారిటీ నాయకుడు అమీర్, సచివాలయ సిబ్బంది రామాంజి,రఫీ, వెలుగు సిబ్బంది శ్రీహరి, డి రామమోహన్, పంచాయతీ సిబ్బంది మరియు నాగిరెడ్డి పల్లె జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్లాస్టిక్ వద్దు సంచులు ముద్దు అని నినాదాలు చేసుకుంటూ అరవపల్లి ఆర్ అండ్ బి కూడలి నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం బస్టాండులో మానవహారం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరం పరిశుభ్రత పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు