Listen to this article

ఎమ్మెల్సీ యాదవ రెడ్డి జనం న్యూస్, మార్చి 16, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్

జగదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్ లో సైన్స్ ఎగ్జిబిషన్ ను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మండల విద్యాధికారి మాధవరెడ్డి, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్,లు పాల్గొన్నారు, విద్యార్థులు తయారుచేసిన వివిధ రకాల పరికరాలను
సాకాకేతిక పరిజ్ఞానం, ఐటీ రంగం సాకేత్రిక దిగ్గజ సంస్థ. మైక్రో స్వాట్ గూగుల్ అమెజాన్ ఆవ్ నమూనాలు కల్లకు కట్టి నట్లు చూపించడం జరిగింది. మాన భారత పర్లమెంట్ నముని లోక్ సభ రాజ సభ నమూనాలు,
పట్టణ ప్రాంతాలలోని జీవన శైలి, గణిత శాస్త్ర పరిభాషాలోని చతుర్విద ప్రక్రియలు ( కుడిక గుణంకలు ) పృజనాత్మకంగా ప్రదర్శణ,ఫైన్స్ పరిజ్ఞానానికి సంబందించిన హైడ్రో పవర్ ప్లాంట్ నీటితో విద్యుత్ ఉత్పత్తి చేసే నమునాలను పరిశీలించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్, మాజీ ఎంపీటీసీ కవిత మరియు పలువురుని శాలువా తో సన్మానించి మెమొంటో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,మాట్లాడుతు విద్యార్థుల మేధాశక్తి పెంపొందించడానికి సైన్స్ ఎగ్జిబిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
అటువంటి ప్రాథమిక వనరులను ఉపయోగించడం ద్వారా జీవితంలోని ప్రతి అంశాన్ని తాకడం ద్వారా పాఠశాల విద్యార్థులు ఇంత గొప్ప ప్రతిభను ప్రదర్శిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల పరికరాలు బాగా చేశారని విద్యార్థులను అభినందించారు. అనంతరం మండల విద్యాధికారి మాధవ రెడ్డి, మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి తమ తమ ప్రతిభను సమాజానికి చూయించి చదువుకున్న పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.విద్యార్థులు తయారుచేసిన పరికరాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. అంతకు ముందు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్, మాట్లాడుతూ సైన్స్ ఎగ్జిబిషన్ తోనే దేశం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. విద్యార్థులను సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ దోదపడుతుందన్నారు, విద్యార్థి దశ నుంచే విద్యార్థులకు నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెంపొందించి వారిలోని ప్రతిభను బయటకు తీసేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని తెలిపారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల వర్ క్స్ మోడల్స్ను ప్రాజెక్టులను విద్యార్థులు బాగా చేశారని ఆయన అన్నారు. విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, అభ్యాసాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడం మరియు పిల్లల విద్యా పురోగతిని అర్థం చేసుకోవడంలో తల్లిదండ్రులను నిమగ్నం చేయడంతోనే ఈ సమావేశం లక్ష్యం సైన్స్ ఎగ్జిబిషన్ అని చెప్పారు, ఈ కార్యక్రమంలో జగదేవ్పూర్ మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ కవితా శ్రీనివాస్ రెడ్డి, కోఆప్షన్ ఏక్బాల్ , తాజా మాజీ సర్పంచ్ యాదవ రెడ్డి, దాచారం కనకయ్య, కొంపల్లి మహేష్, సయ్యద్ మునీర్, ఉపాధ్యాయుడు గోపాల్ రెడ్డి,విద్యార్థుని విద్యార్థులు , తండ్రి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.