

జనం న్యూస్ -మార్చి 17- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- ఈనెల 19వ తేదీ మిర్యాలగూడలోని లక్ష్మీ కల్యాణ మండపంలో జరగనున్నటువంటి మాలల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి ఒక ప్రకటనలో కోరారు, ఎస్సీ వర్గీకరణలను వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్నటువంటి మాలల ఆత్మగౌరవ సభను అన్ని సంఘాల నుంచి మాల ఆత్మబంధువులందరూ భారీగా హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు, మిర్యాలగూడలో జరగనున్నటువంటి మాలల ఆత్మగౌరవ సభకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగిస్తారని తెలిపారు, ప్రభుత్వాలు మారిన దళితులను విభజించి పాలించే విధానం మాత్రం మారట్లేదని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాజకీయ పార్టీలు దళితుల మధ్య చిచ్చు పెడుతున్నాయని అన్నారు, కావున మిర్యాలగూడ లక్ష్మీ గార్డెన్స్ లో మార్చి 19వ తారీఖున జరగనున్న మాలల ఆత్మగౌరవ సభకు మాల బంధువులందరూ అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేసి రాజకీయ పార్టీలకు మన బలం ఏంటో తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు విద్యార్థి విభాగం జాతీయ కార్యదర్శి తాళ్లపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.