

జనం న్యూస్ మార్చి 16 సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్ గూడా లోని పలు కాలనీలను ఐలాపూర్ మాణిక్ యాదవ్ శనివారం ఉదయం సందర్శించారు. అందులో ఏస్ ఎల్ ఎన్ -4 కాలనీలోని డ్రైనేజీ సమస్యను ఐలాపూర్ బి ఆర్ ఏస్ నాయకులు మాణిక్ యాదవ్ దృష్టికి రావడం జరిగింది.తక్షణమే స్పందించి గత పాలకులు చేసిన అనాలోచిత ధోరణి వాళ్ల కాలనీ వాసులు నిరంతరం పలు సమస్యలతో ఇబ్బందులకి గురవుతున్నారని ఈ సమస్యని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించడానికి చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు.కాలనీ వాసులకు ఎల్లవేళలా అండగ అందుబాటులో ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది.కాలనీవాసుల సమస్యలు తీర్చడమే మా అంతిమ లక్ష్యమని కాలనీ వాసులతో మాణిక్ యాదవ్ అన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.