

బిచ్కుంద మార్చ్ 16 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గుండెకల్లూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శంకుస్థాపన చేశారు. _అనంతరం గ్రామంలో సి.సి రోడ్ల నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేశారు. అదేవిధంగా గ్రామానికి నూతనంగా మంజూరైన ప్రభుత్వ చౌకధర దుకాణాన్ని ప్రారంభించారు,లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ఎమ్మార్వో సురేష్, బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్, డెలికేట్ విట్టల్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్. మాజీ ఎంపీటీసీ రాజు పటేల్, మాజీ జెడ్పిటిసి నాగనాథ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్, బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు అనిల్ పటేల్. నాగరాజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు


