Listen to this article

జనం న్యూస్ మార్చ్ 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు ఆదేశాల మేరకు వాంకిడి మండల కేంద్రంలో జాతీయ రహదారి మండల అధ్యక్షులు నారాయణ ఆధ్వర్యంలో ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. నారాయణ మాట్లాడుతూ.. శాసనసభ సమావేశంలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, కేటీఆర్ లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను ఓర్వలేక బీఆర్ఎస్ ప్రభుత్వం నిందలు వేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన అధ్యక్షులు ప్రశాంత్, టౌన్ అధ్యక్షులు అనిల్, ఓబీసీ సెల్ అధ్యక్షులు గణేష్, యువ నాయకులు దీపక్, మాజీ సర్పంచ్ పేంటు, తులస బాయి, మాజీ ఎంపీటీసీ ఉష, పండు, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు