Listen to this article

జనం న్యూస్ 16మార్చ్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురుమల శంకర్ ) 17 వ తేదీ సోమవారం జరగనున్న ప్రజావాణి రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ సోమవారం మరియు మంగళవారం జిల్లా పర్యటన ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం అంతా పర్యటనలో నిమగ్ధమై ఉండటం వలన సోమవారం జరగనున్న ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కావున ప్రజలందరూ గమనించి దరఖాస్తులు ఇవ్వడానికి ఐ డి ఓ సి కార్యాలయానికి రావద్దని సూచించారు.