Listen to this article

జనం న్యూస్ జనవరి 13 శాయంపేట మండలం
భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి -స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో శాయంపేట మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత మూర్తి స్వామి వివేకానంద స్వాబలంబన ప్రగతిశీల దేశం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి యువత సమాజాభివృద్ధి కోసం పట్టుదల మతసామరస్యం సేవాగుణంతో పనిచేయాలని చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు ఈ కార్యక్రమంలో పరకాల ఏఎంసి వైస్ చైర్మన్ మారేపల్లి రవీందర్ కాంగ్రెస్ మండల నాయకులు చిందం రవి శానం కుమారస్వామి మార్కండేయ రఘు సింగ్ రవిపాల్ రాజు మారపల్లి కట్టయ్య కొమ్ముల విష్ణు తదితరులు పాల్గొన్నారు….