

ఆలయ పౌండేషన్ ఆధ్వర్యంలో ఆక్సీజన్ కాన్సెంట్రేటర్ అందజేత.. నిరుపేద కుటుంబాలకు అండగా పరికిపండ్ల నరహరి ఐఏఎస్..
జనం న్యూస్ // మార్చ్ // 17 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా వీణవంక మం వల్లభాపూర్ గ్రామంలో నామని రాజయ్య అనే రైతు అనారోగ్యాని కి గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ” ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ” అవసరం ఉండగా ఆలయఫౌండేషన్ కో ఆర్డినేటర్ గాదె గుణసాగర్ ను ప్రదించారు.ఆలయఫౌండేషన్ మార్గదర్శకులు పరికిపండ్ల నరహరి ఐఏఎస్ అధికారి చొరవతో, ఆక్సిజన్ కాంన్సెంట్రేటర్ ను అందించడం జరిగింది.నామిని రాజయ్య, కుటుంబం సభ్యులు నరహరి ఐఏఎస్ అధికారి కి ధన్యవాదాలు తెలియజేశారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ జిల్లాలోవిద్యా వైద్యం మరియు ఉపాధి కార్యక్రమాలను ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్నారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వుండి జన్మభూమి పై మమకారంతో సేవ చేయడం గొప్ప సంకల్పం అభినందనీయం, నిరుపేదలకు ఆలయ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలు చాల గొప్ప వరంగా,చెప్పవచ్చు. నిరుపేద కుటుంబలు, ఆలయంలో పరికిపండ్ల ఐఏఎస్ కి, మరియు ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గాదె గుణసాగరకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయఫౌండేషన్ కో ఆర్డినేటర్ గాదె గుణసాగర్ నేత, నామని విజెందర్, నామని రమేష్ పాల్గొన్నారు.
