Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 17. తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు బస్టాండ్ సెంటర్ లో గల అమరజీవి పొట్టి శ్రీరాములు పార్క్ లో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు వేణుగోపాల స్వామి ఆలయ ధర్మకర్త జవ్వాజి విజయ భాస్కర రావు, వాసవి సముదాయ సత్రం సభ్యులు ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు పోలేపల్లి జనార్దన్ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ మూర్తి స్వాతంత్ర సమరయోధుడు పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదటిగా ఆ మహనీయుడు విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూల మాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్బంగా వెలుగొండ ఆర్యవైశ్య సంఘం సత్రం అధ్యక్షులు కశెట్టి జగన్ బాబు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తెలుగు మాట్లాడే వారికీ బాషా ప్రాయుక్త ముగా ప్రత్యేక రాష్ట్రము కావాలని ఆమరణ నిరాహార దీక్ష బోలుసు సాంబ శివ మూర్తి ఇంటి వద్ద దీక్ష చేసి ఆత్మార్పణ చేయడం వలన తెలుగు మాట్లాడే వారికీ ప్రత్యేక రాష్ట్రము వచ్చిందని తెలిపారు స్వాతంత్ర యుద్ధం లో తనదైన శైలిలో తన పాత్ర ఎనలేనిది అని అన్నారు అనంతరం స్వీట్స్ పంపిణీ చేసారు ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు ఈర్ల వెంకటయ్య,కుందురు చిన్న కాసిరెడ్డి, కొలగట్ల భాస్కర్ రెడ్డి,బేడుదూరి పుల్లయ్య, భవనం రామకృష్ణారెడ్డి ఆర్యవైశ్య సభ్యులు నేరెళ్ల కార్తీక్,వాగిచర్ల మోహన్,జవ్వాజి వెంకటేశ్వర్లు, కశెట్టి రవి, సూరె సువర్ణ, దోగిపర్తి మల్లిఖార్జున,నేరెళ్ల కృష్ణ,గుణుపూటి వెంకటేశ్వర్లు,చెక్క బాల రంగంతదితరులు పాల్గొన్నారు